🔹అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటే, తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ గారు.
🔹అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలి.
🔹ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు రాకేష్. జబర్దస్త్ లో రాణించి, రాకింగ్ రాకేష్ గా ఎదిగారు.
🔹కేసీఆర్ గారి పేరుతో సినిమా తీయడం గొప్ప విషయం.
🔹కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేసిండు కేసీఆర్.
🔹పల్లెలనే కాదు, పట్టణాలను అభివృద్ధి చేసిండు.
🔹హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజినీ కాంత్ న్యూయార్క్ లో ఉన్ననా, ఇండియాలో ఉన్ననా అన్నడు.
🔹భౌతికంగా మాత్రమే కాదు, రాష్ట్రాన్ని సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చేసిండు.
🔹తెలంగాణను దేశానికి దిక్సూచిగా చేసిండు కేసీఆర్ గారు.
🔹అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు తీస్తారు. అధికారంలో లేకున్నా కేసీఆర్ అని సినిమా తీసాడు.
🔹దీనికి ఎంతో ధైర్యం, దమ్ము కావాలి. నిజమైన అభిమానానికి ఇది నిదర్శనం.
🔹అందరూ కేసీఆర్ సినిమా చూసి, రాకేష్ ను అభినందించాలని ఆకాంక్షిస్తున్నాను.
🔹సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.
0 Comments