*PART – 3*
*కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు...*
*మాజీమంత్రి హరీశ్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాయింట్స్*
• 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. నెల రోజుల్లోనే సాగునీటిశాఖ మంత్రిగా ఉన్న నేను, ఇంజనీర్ల బృందం కలిసి మహారాష్ట్రకు వెళ్లినం.
• అక్కడ కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ను కలిసి ప్రాజెక్టు నిర్మాణం అవసరాన్ని వివరించినం.
• వారి సీఎం పృద్వీరాజ్ చౌహాస్, ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను గుర్తు చేశారు.
• ఫుల్ రిజర్వాయర్ లెవల్ 152 మీటర్లకు అనుగుణంగా చేపట్టే ప్రాజెక్టు పనులు నిరుపయోగమని, తాము 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే అంగీకరిస్తామని ఆనాడే తేల్చి చెప్పినట్లు చెప్పారు.
• ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య రెండుసార్లు హైదరాబాదులో చర్చలు జరిగాయి.
• ఆనాడు దివంగత ఆర్.విద్యాసాగర్ రావు కూడా పాల్గొని మహారాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు.
• అయితే తుమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో ప్రాజెక్టు నిర్మించేందుకు బీఆర్ఎస్ ఎంతో ప్రయత్నం చేసింది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
• మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆనాటి సాగునీటి మంత్రి గిరీష్ మహాజన్ తో నేను (హరీష్ రావు) ముంబైలో సమావేశమవడం జరిగింది.
• ఈ సమస్యను ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని గిరీశ్ గారు సూచించారు.
• ప్రాణహిత – చేవెళ్లను ఎందుకు రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందంటే... నీటి లభ్యత లేకపోవడమే కారణం.
• హైడ్రాలజీ వాళ్లు అక్కడ ప్రాజెక్టుకు సరిపడా నికర జలాలు లేవన్నారు.
• ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించింది.
• ఉమ్మడి ఏపీలో 2008న రాసిన లేఖలో ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ పై సీడబ్ల్యూసీ స్పందించింది.
• ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన బ్యారేజీలు లేవని, అందుకే కృత్రిమ జలాశయాలను గానీ, ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది.
• తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేసినం.
• అవేమీ ఫలించకపోవడంతోనే ప్రత్యామ్నయ స్థలం కోసం ఆలోచన చేసినం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిన స్థలమే.. మేడిగడ్డ
0 Comments