🔷 ఈద్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
🔷 రంజాన్ పవిత్ర మాసంలో దైవ ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావనలు, శాంతి సౌభ్రాతృత్వాలు ఫరిడవిల్లుతాయి
🔷 గంగా జమున తెహజీబ్‌కు నిలయం తెలంగాణ
🔷 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి
🔷 విద్యా, సామాజిక సంక్షేమ రంగాల్లో వినూత్న పథకాలు అమలు
🔷 మత సామరస్యం, లౌకికవాద పాలనతోనే శాంతి భద్రతలు
🔷 అభివృద్ధికి సామాజిక ప్రశాంతత కీలకం.. ఆ దిశగా నాటి బీఆర్ఎస్ పాలన పటిష్టమైన పునాది వేసింది
🔷 బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కొనసాగించడం ద్వారానే మరింత ప్రగతి సాధ్యం👇
🔹ఇస్లాం మతస్తుల పవిత్ర మాసం రంజాన్ పర్వదినాల ముగింపు 'ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
🔹భక్తి శ్రద్ధలతో కూడిన ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో ప్రశాంతమైన చిత్తంతో రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో శాంతి సౌభ్రాతృత్వ భావనలు ఫరిఢవిల్లుతాయన్నారు.
🔹భిన్న మతాల సంప్రదాయాలతో కూడిన జీవన విధానం, గంగా జమున తెహజీబ్‌కు తెలంగాణ నేల నిలయమని కేసీఆర్ అన్నారు.
🔹తెలంగాణ సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమ కాలం నుంచి స్వరాష్ట్రంలో సాగిన పదేండ్ల ప్రగతి పాలన దాకా ముస్లిం మైనారిటీలను తాము ప్రధాన భాగస్వాములను చేశామని కేసీఆర్ తెలిపారు.
🔹విద్యా తదితర రంగాల్లో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వినూత్న కార్యక్రమాలను ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
🔹అన్ని మతాలను గౌరవిస్తూ మతసామరస్యానికి కాపాడుతూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద విలువలను అమలుచేస్తూ, నాటి తొలి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణ నూతన తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిపిందన్నారు.
🔹ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పిందని, తద్వారా దేశ విదేశాలనుంచి హైదరబాద్‌కు పెట్టుబడులు తరలివచ్చాయన్నారు.
🔹రాష్ట్రంలో పాలనపై పూర్తి విశ్వాసంతో హైదరబాద్‌లో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్ర ఆర్ధిక స్థితి వూపందుకోవడం, రియల్ ఎస్టేట్, ఫార్మా, సహా పలు రంగాల్లో తెలంగాణ యువతకు లక్షలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు.
🔹నాటి బీఆర్ఎస్ అనుసరించిన విధానాలు ప్రజల్లో పరమత సహనాన్ని పెంచి, తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమికను పోషించాయన్నారు.
🔹ప్రజల నడుమ సౌభ్రాతృత్వ భావనలు, ప్రేమాభిమానాలతో తాము వేసిన సామాజిక ఐక్యతా పునాదిని కొనసాగించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
0 Comments