సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రైతు రుణమాఫీ వరద సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ జగదీశ్వర్ రెడ్డి
రెండు లక్షల రుణమాఫీ పై వెంటనే స్పష్టత ఇవ్వాలి
ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోలంలోకి నె డుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీ పై అర్దం లేని స్పష్టతలేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నేడుతున్నారు
రుణమాఫీ 49 వేల కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయించి 18 వేల కోట్లు విడుదల చేసి రైతులకు పదివేల కోట్లు మాత్రమే చేరవేశారు
ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదని రైతు రుణమాఫీ పై వెంటనే స్పష్టత ఇవ్వాలి
రెండు లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు సబ్బు చేసి రెండు లక్షల పైన ఉన్న రుణం కట్టారని ఇప్పటికి రెండు లక్షల రుణమాఫీ కాలేదు
ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉంది ఇది తప్పించుకునే ప్రయత్నం
బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టి రెండు లక్షల పైన కడితేనే మాఫీ వస్తుందని చెప్పి రుణం కట్టించుకున్నారు
ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేయడమే కాకుండా ప్రస్తుతం కూడా అధికారంలోకి వచ్చి మోసం చేయడం దేశ చరిత్రలో తెలంగాణలోనే ఇది ప్రథమం
కరెంటు విషయానికి వస్తే ఇటీవల మా మిత్రుడు ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటికి వెళితే అరగంటలో ఐదు ఆరుసార్లు పోయిందని మళ్లీ పాత పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఇంట్లో టీవీలు ఫ్రిజ్లు కాలిపోవడం ఆటోమేటిక్ జనరేటర్ల సైతం కాలిపోతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యక్తిగత అవసరాలకు మంత్రులు ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారు తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దృష్టి పెట్టడం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది రైతులేనని రైతులు రుణమాఫీ రైతు భరోసా ఇస్తారని గ్రామాల్లో ఎక్కువగా రైతులు ఓట్లు వేసి నమ్మి గెలిపించారూ.
రకరకాల మాటలతో రైతులను గందరగోళంలో పెడుతూ మోసం చేస్తుందని ఇప్పటికైనా రైతు రుణమాఫీ స్పష్టత ఇవ్వాలని ఎగ్గొట్టే ఆలోచన ఉంటే అది కూడా చెప్పాలి
వానకాలం పెట్టుబడికి రైతులు అప్పుసప్పు చేసి పెట్టుబడి పెట్టారని వానాకాలం పంట చేతికి వచ్చే సమయం వస్తున్న నేటి వరకు రైతుభరోసా ఇవ్వలేదు
సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారని వారికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి
వరద బాధితులకు సాయం చేస్తున్నామని చెబుతున్న ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
హెచ్చరికలు చేయకపోగా వరద ప్రాంతాలను ఆదుకోవడంలో బురద నిలిచిన ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదు
ఎవరికి కావాలి పది వేలు మా ఇంట్లో వచ్చి అరగంట ఉంటే మా బాధ తెలుస్తుందని ప్రజలు ఆవేదన చేస్తూరు. మంత్రులకు వెళ్లి ఆ ఇండ్లలో అరగంట నిలబడే దమ్ము ఉందా
ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే మాపై దాడులు చేసి దూర్మార్గానికి పాల్పడ్డారు
రైతులంతా రుణమాఫీ అవుతుందని బ్యాంకులో రెండు లక్షల పైన కట్టారని ప్రస్తుతం 2 లక్షల పైన రుణమాఫీ కట్టవద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న
రైతుకు బ్యాంకులో అప్పు ఎంతైనా ఉండొచ్చని ప్రభుత్వం ఇస్తామన్న రెండు లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులో జమ చేయాలి
.jpeg)
0 Comments