మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఘనంగా నివాళులు

 





ఎంపీ వద్దిరాజు స్వర్గీయ మాజీ మంత్రి పాల్వాయికి ఘనంగా నివాళులు

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ మాజీ సభ్యులు స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వర్థంతి సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు

ఈ సందర్భంగా గోవర్థన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎంపీ రవిచంద్ర మాట్లాడారు.గోవర్థన్ రెడ్డి గొప్ప తెలంగాణ వాది అని, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించారని రవిచంద్ర కొనియాడారు ఆయన తనకు ఎంతో సన్నిహితులని, వారి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని ఎంపీ వద్దిరాజు చెప్పారు

Post a Comment

0 Comments