💥 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావులను బుల్డోజర్లతో తొక్కిస్తా అని రేవంత్ రెడ్డి హెచ్చరించడంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు.
రేవంత్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 👇
🔹 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా ముఠా నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు.
🔹 ముఖ్య మంత్రికి పాలన చేతకాక అసహనంతో అశాంతి లేపే కుట్రకు తెరలేపుతున్నాడు.
🔹 రేవంత్ వాడుతున్న ఆటవిక భాష శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది.
🔹 వీపు చింతపండు చేస్తా బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతా అని మా నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతున్నాడు
🔹 అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రేవంత్ బండ బూతులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.
🔹 రేవంత్ పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
🔹 చిన్న పోస్టు పెడితేనే మా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదుచేస్తున్న పోలీసులు .
🔹 తొక్కుతా చంపుతా అంటూ సీఎం స్థాయిలో బజారు భాష మాట్లాడం వల్ల కింది స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను హింస చేయడానికి ప్రేరేపిస్తున్నారు.
🔹 సీఎం భాష వల్లే మా నేతలపై దాడులు జరుగుతున్నాయి.
🔹 ఖమ్మంలో హరీష్ రావుపై, ముషీరాబాద్ లో కేటీఆర్ పై, కొండాపూర్ లో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులు రేవంత్ చేయించిన దాడులే.
🔹 రేవంత్ తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే భాద్యత వహించాలి.
🔹 హోమ్ మంత్రిగా ఉంటూ పోలీసులకు రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?
0 Comments