వాతావరణ శాఖ హెచ్చరికలను సీఎం ,మంత్రులు పట్టించుకోక పోవడం వల్లే వరదల వల్ల భారీ గా నష్టం జరిగింది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..మొదటి రెండు రోజులు వరదలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు
..ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు విఫలమయ్యారు
.తొమ్మిది మందిని కాపాడిన సుభాన్ హీరో అయ్యారు ..ముగ్గురు మంత్రులు జీరో అయ్యారు
..కనీసం సుభాన్ లాంటి వారిని ఒకరిని కేబినెట్ లో పెట్టుకుంటే బాగుండేది
..అస్సలు ఈ ప్రభుత్వం లో టీం వర్క్ లేదు
..కారణాలు ఏవైతేనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది
..సీఎం సీటు లో కూర్చున్న ఆయన మీద మంత్రులకు కూడా గౌరవం లేదు
..ఎన్నికలపుడు ప్రచారానికి నాలుగు ఐదు హెలికాఫ్టర్ లు వాడారు
..వరద సాయానికి ఒక్క హెలికాఫ్టర్ కూడా సమకూర్చుకోలేదు
..కేసీఆర్ ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ..వరద బాధితులను ఆదుకోవడం లో శ్రద్ధ చూపడం లేదు
..కేసీఆర్ అంటే వ్యక్తి కాదు వ్యవస్థ
..తెలంగాణ అభివృద్ధి పునాదుల్లో కేసీఆర్ కనిపిస్తారు
..బీ ఆర్ ఎస్ శ్రేణులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాయి
..సంచలనాల కోసం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం పని చేయడం లేదు
..ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు
..అన్నీ డైవర్షన్ రాజకీయాలే
..ఇక్కడ సరిగా పని చేయకుండా ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నారు
..వరదల్లో వ్యక్తి చనిపోతే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం కొత్తా ?
..ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ వరదల విషయం లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు
...వాటినే అమలు చేయాలని మేము కోరుతున్నాం
..సీఎం రేవంత్ కు కలుపుకుపోయే తత్వం లేదు ..వరదల్లోనూ రాజకీయాలు చేస్తున్నారు
..సీఎం వాడుతున్న భాష ను ఖండిస్తున్నాం
..రాష్ట్రం లో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
..అయినా ప్రభుత్వం నష్టం వివరాలు వెల్లడించడం లేదు
..కేంద్ర హోం శాఖ రాష్ట్రానికి sdrf అకౌంట్ లో ఉన్న నిధుల పై ఉత్తరం రాసింది
..విపత్తు నిధి వాడకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ,అక్టోబర్ నెలల్లో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు
.ఆ వివరాలు సమర్పించడం లో ప్రభుత్వం విఫలమయ్యింది
..అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా ?
..విపక్షాలను తిట్టడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకోండి
..చేరికలకు ఇప్పటికే ఓ మంత్రిని కేటాయించుకున్నారు
..కేంద్రాన్ని ఎంత సాయమైనా కోరండి ..మేము మద్దతు నిస్తాం
..మిషన్ కాకతీయ లో బాగు చేసిన చెరువులు తెగాయని సీఎం మాట్లాడుతున్నారు
..ఒకటో అర చెరువులు తెగడం సాధారణ విషయమే ..సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
..వరద బాధితులు సీఎం మంత్రులను శాపనార్థాలు పెడుతున్నారు ..వారి మాటలు చూసైనా కనువిప్పు కలగాలి
..వట్టెం పంపు హౌజ్ మునక ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే జరిగింది
..పంపు హౌజ్ మునిగాక జిల్లా మంత్రి వెళ్లారు
..సీఎం పాలమూరు బిడ్డనని చెప్పుకుంటారు ..కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు
..సీఎం కు చావు కు పెళ్ళికి తేడా తెలియడం లేదు
..ప్రకాశం బ్యారేజి నుంచి 18 లక్షల క్యూసెక్కుల కృష్ణా నీళ్లు వృధాగా వెళ్లి సముద్రం లో కలిశాయి
..ఈ ప్రభుత్వానికి కృష్ణా నీళ్లు వాడుకోవాలని తాపత్రయం లేదు
..కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేబినెట్ లో తీసుకున్న తొలి నిర్ణయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
..పాలమూరు కేసీఆర్ ఆత్మ
..నలభై రోజులు కష్టపడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నాలుగు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండేది ..దాంట్లో ప్రభుత్వం విఫలమయ్యింది
..ఇప్పటికైనా వరద భాదితులను పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

0 Comments