తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

 





తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి ( సెప్టెంబర్ 10) సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. 


తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని తెలిపారు. 

ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించేదిశగా వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Post a Comment

0 Comments