*జూరాలను వెంటాడుతున్న నీటి లీక్ సమస్య*
హైదరాబాద్: జనవరి 21
తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతుంది, 2021లో రిపేరు పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం 25% పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. గేట్లు రోఫ్ డామేజ్, గేట్ల నుంచి నీటి లీకేజీల రిపేర్ పనులు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు దీంతో నీటి లీకేజీ సమస్య పెను సమస్యగా మారింది.
ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఈ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోని పలు గేట్లు డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత సీజన్లో అయినా డ్యామేజ్ కారణంగా ప్రజెక్టును నేటికి లీకేజీ సమస్య వెంటాడు తుంది.
ప్రస్తుతం డ్యామ్ లోని 12 క్రస్ట్ గేట్ల నుంచి కంటిన్యూ గా నీరు లీక్ అవుతుంది. ఇందులో 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్ అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే గత సీజన్‌లో అయిన డ్యామేజ్‌లకు మరమ్మతులు చేయక పోవడంతో తుప్పుపట్టి గేట్లకు అమర్చిన రబ్బర్లు ఊడిపోయినట్లు తెలుస్తుం ది. ఈ ప్రాంతంలో అధికంగా నీరు లీక్ అవుతుండగా.. ప్రాజెక్టు అధికారులకు ఎం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
అయితే దాదాపు 12 గేట్ల నుంచి లీకేజీతో నీరు వృధాగా పోతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కంటిన్యూగా నీరు లీక్ అయితే వచ్చే వేసవి నాటికి జూరాల ప్రాజెక్టు నీటి పై ఆదారపడిన ప్రజలకు నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే జూరాల ప్రాజెక్ట్ భద్రతపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారని, మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
0 Comments