డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని ఖండించిన మాజీ మంత్రి 
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
 
🔹 డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవు.

🔹 డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్ చేయడం దారుణం.

🔹 కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా ఇది జరుగుతుంటే, ఇక్కడ మాత్రం ఏఈఓల నెత్తిన రుద్దడం ఎందుకు?

🔹 తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేందుకు ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాలని, 1500 కొత్త ఏఈఓల పోస్టులను సృష్టించి, 2601 రైతు వేదికలను ఏర్పాటు చేశారు.

🔹 తెలంగాణలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపు, అధిక దిగుబడి సాధించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఏఈఓల పాత్ర ఎనలేనిది.

🔹 అప్పటికీ వారికి పనిభారం పెరుగుతుందని మళ్లీ సర్వే చేయించి, సుమారు 350 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వాటిని మంజూరు చేసి కొత్త వారిని నియమించాలి.

🔹 ఏఈఓల విజ్ఞప్తి మేరకు డిజిటల్ క్రాప్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించడం, లేదా ఏజెన్సీలకు పనిని అప్పగించడం చేయాలి.

🔹 డిజిటల్ క్రాప్ సర్వేకు విడుదలైన నిధులను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు?

🔹 ఏఈఓలలో అత్యధికులు మహిళలు ఉన్నారు. క్రాప్ సర్వే పేరుతో వారిని నిర్మానుష్య వ్యవసాయ కమతాలకు ఎలాంటి రక్షణ లేకుండా ఎలా పంపిస్తున్నారు? వారి భద్రతకు బాధ్యత ఎవరిది?

🔹 వారు ఇప్పటికే 49 రకాల విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా వారి మీద పనిభారం ఎందుకు పెడుతున్నారు?

🔹 ఔట్‌సోర్సింగ్ మీద పనిచేస్తున్న వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసం?

🔹 ప్రజా పాలన అంటే బెదిరింపులేనా?

  🔹ప్రజా పాలనలో ఉద్యోగులను కూడా కాంగ్రెస్ విభజించి పాలిస్తుంది.

  🔹రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది.

Post a Comment

0 Comments