★ సుంకిశాలపై విచారణకు
వెనుకడుగు ఎందుకు?
★ ప్రమాదానికి బాధ్యులెవరు?
కప్పిపుచ్చుతున్నదెవరు?
★ కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో
పెట్టకుండా ఆపుతున్నదెవరు?
★ రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు
కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తున్నదని కేటీఆర్ నిలదీశారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
0 Comments