ఎంపీ వద్దిరాజు స్వర్గీయ శివశంకర్ గారికి ఘన నివాళులు

 
*ఎంపీ వద్దిరాజు స్వర్గీయ శివశంకర్ గారికి ఘన నివాళులు*
*Date 10/08/2024*
----------------------------------------
*కేంద్ర మాజీ మంత్రి, బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో,జాతీయ స్థాయిలో ఓబీసీలకు రిజర్వేషన్స్ సాధించి పెట్టిన మహనీయులు జస్టిస్ పుంజాల శివశంకర్ 95వ జయంతి ఉత్సవాలు శనివారం తెలంగాణలో ఘనంగా జరిగాయి*

*జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రధాన కార్యక్రమం హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటెనరీ హాలులో జరిగింది*

*రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్మణ్,మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వీ.ఈశ్వరయ్య, భవానీప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్.రమణ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సీ.విఠల్,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తదితరులు శివశంకర్ చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు*

*ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆకుల రజిత్,కో-కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వేదుళ్ల వెంకటరమణ,బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్,బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,మున్నూరుకాపు ప్రముఖులు రౌతు కనకయ్య, ప్రొఫెసర్ జీ.లక్మణ్,దుర్గం రవీందర్,ఏ.సత్యనారాయణ,పడాల భిక్షపతి,నేతి మంగమ్మ,ఊసా రఘు, లవంగాల అనిల్,బండి పద్మ తదితరులు దివంగత మహానేత శివశంకర్ చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు*

*ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ*
👉 బీసీలకు రిజర్వేషన్స్ సాధించి పెట్టిన మహనీయులు శివశంకర్ మనందరికి ఆరాధ్యులు 
👉 హైదరాబాద్ శివార్లలోని మామిడిపల్లిలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన శివశంకర్ 80ఏండ్ల కిందటే 1800 కిలోమీటర్లు దూరంలో ఉన్న అమృత్ సర్ వెళ్లి డిగ్రీ చదివారు 
👉 జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే బలమైన సంకల్పం కలిగి క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగిన ఆయన మనందరికి ఆదర్శప్రాయులు, స్ఫూర్తిప్రదాత 
👉 న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా శివశంకర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం 
👉 ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీలకు న్యాయ, రాజకీయ సలహాదారుగా వారితో పాటు ఆనాటి ప్రముఖులందరి అభిమానానికి చూరగొన్న మహనీయులు శివశంకర్ 
👉నేటి యువత ఆయన జీవిత చరిత్రను చదివి స్ఫూర్తినొందాలి 
👉బీసీలమైన మనం తారతమ్యాలను పక్కనబెట్టి చేయి చేయి కలుపుతూ రాజ్యాధికారం వైపు అడుగులేద్దాం 
👉 సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం 
👉 మరింత ఐకమత్యంతో ముందుకు సాగితే రాజ్యాధికారం సాధించుకోవడం సుసాధ్యమే
👉బీసీలకు ఆరాధ్యులైన శివశంకర్ కాంస్య విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి
👉 సొంతంగా కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత చరిత్రను  పాఠ్యాంశంగా చేర్చాలి 
*ఈ సందర్భంగా "జై బీసీ జైజై"," వర్థిల్లాలి వర్థిల్లాలి బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి","అమర్ హై అమర్ హై శివశంకర్ అమర్ హై","సాధిద్దాం సాధిద్దాం శివశంకర్ గారి ఆశయాలు సాధిద్దాం"అంటూ ముక్తకంఠంతో నినదించారు*

Post a Comment

0 Comments