స్వచ్ఛదనం..పచ్చదనంపై హరీష్ రావు కామెంట్స్

స్వచ్ఛదనం..పచ్చదనంపై హరీష్ రావు కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్ట్ 5 నుంచి 9వరకు ప్రోగ్రామ్ తీసుకుంది. 

గతంలో మేము  పారిశుద్ధ్య వారోత్సవాలు చేసేవాళ్లం. వర్షాలు రాకముందే గ్రామాల్లో శుభ్రతకు చర్యలు తీసుకున్నాం.  

ఈ ప్రభుత్వం ఆ పథకం  పేరు మార్చింది. కానీ గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదు. 

మొదటి రోజు సమస్యలను గుర్తించాలన్నారు. రెండో రోజు ఒహెచ్ఆర్ఎస్ క్లీనింగ్, తాగునీటి పైపుల బాగు చేయాలని. 
కానీ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడుంది? ఆయిల్ బాల్స్ ఎక్కడ? 

సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. సెక్రటరీలు లక్ష వరకు సొంత డబ్బు ఖర్చుపెట్టారు. కొందరు బదిలీ అయ్యారు. పెట్టిన పైసలు వస్తయో లేవో తెలీదు. గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి. 
స్వచ్చదనం కావాలంటే ట్రాక్టర్లకు డీజిల్ లేదు. కరెంట్ బుగ్గలకు డబ్బులు లేవు. కూలీలకు డబ్బుల్లేవు. 
మొక్కుబడిగా చేయడం తప్ప ఏమీ లేదు. నిధులు లేవు, ప్రణాళిక లేవు. మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 
గ్రామాలు చెత్తకుప్పలుగా మారాయి. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలాయి. దవాఖానాల్లో మందులులేవు. మంచాలు లేవు. 

పచ్చదనం, పరిశుభ్రత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత పదేళ్లలో హరితహారం మూడు నాలుగు నెలలు పండగలా సాగేది. నేడు ఈ కార్యక్రమం మొక్కుబడి మాత్రమే. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 

కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్లను గ్రామాలకు ఇవ్వకుండా దారి తప్పిస్తున్నది ఈ ప్రభుత్వం. 

కేంద్రం ఇచ్చిన నిధులను ఆపడం వల్లే ఈ సమస్యలు. అమ్మ పెట్టదు అడుక్కతిననివవ్వదన్నట్లు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఇవ్వడం లేదు.

Post a Comment

0 Comments