....మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్
...రాష్ట్రం లో హాస్టళ్లు ,యూనివర్సిటీ ల్లో ,గురుకులాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది
..విద్యార్థులు ,నిరుద్యోగులు ,ఉద్యోగులు ఎవ్వరూ ఈ ప్రభుత్వం లో సంతోషంగా లేరు
...ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణ ప్రకటించబోతున్నారు
...పాల రైతులు రాష్ట్రం లో పరేషాన్ లో ఉన్నారు
...గతం లో పాడి పంటలు అనేవారు .ఇపుడు పాడి ,పంట వేర్వేరు అయ్యాయి
..రైతుకు వ్యవసాయానికి పాడి తోడయ్యేది
..రాష్టం లో నాలుగు నెలలైనా పాడి రైతులు పాలు పోస్తున్నా డైరీ డబ్బులు ఇవ్వడం లేదు
...హైదరాబాద్ లో 30 లక్షల లీటర్ల పాలు ప్రతి రోజూ వినియోగిస్తారు
..ఐదు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తాయి
..ఈ ఐదు లక్షల లీటర్లకు కూడా పాడి రైతులకు డబ్బులు చెల్లించడం లేదు
..మిగతా 25 లక్షల లీటర్ల పాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి ?
..తెలంగాణ డైరీ ని బొంద పెట్టి ఆంధ్రా డైరీ లను పెంచి పోషించే కుట్ర జరుగుతుందా అనే అనుమానం వస్తోంది
..కేసీఆర్ హాయం లో పాడి రైతులకు లీటర్ కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చే వారు ..దానా కు డబ్బులు ఇచ్చే వారు
..ఇపుడు పాడి రైతులకు వాళ్ళు పోసిన పాలకు డబ్బులు ఇవ్వడం లేదు
..విజయ డైరీ లో 500 కోట్ల మేర పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి
..వాటిని కనీసం యాదాద్రి దేవస్థానానికో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుంది
..త్వరలో వాటి గడువు దాటితే 500 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి
..హైదరాబాద్ లో 30 లక్షల లీటర్ల పాలు అవసరం ఉంటే రైతుల నుంచి ఐదు లక్షల లీటర్లే సేకరిస్తున్నారు
..ఈ ఐదు లక్షల లీటర్ల లో కూడా కోత పెట్టాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు
..తెలంగాణ పాడి రైతులను ఖతం చేయాలని కుట్ర జరుగుతోంది
..మొత్తం 30 లక్షల లీటర్ల పాలు ఎవరెవరు సరఫరా చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి
..రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి వలస కూలీలుగా పొట్ట చేతిన పట్టుకుని వెళ్లే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది
..50 లక్షల లీటర్ల పాలు తెలంగాణ కు అవసరం అవుతాయి ..పాల ఉత్పత్తి పెంచాలి తప్ప తగ్గించకూడదు
..పాడి రైతులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల బకాయిలు పది హేను రోజుల్లోగా చెల్లించాలి
..లేదంటే పాడి రైతులతో కలిసి ఉద్యమిస్తాం
..నేను పాడి రైతుగా మాట్లాడుతున్నా .దయచేసి పాడి పరిశ్రమను రాజకీయాలకు తావు ఇవ్వకుండా బతికించండి
..పాల ఉత్పత్తి ని తగ్గిస్తే కల్తీ పాలు మార్కెట్లో విచ్చల విడిగా వస్తాయి
..ఇప్పటికే కల్తీ పాల విక్రయం పై మీడియా లో కథనాలు వస్తున్నాయి
..కేసీఆర్ హాయం లో పాడి రైతులకు పదిహేను రోజులకు ఓ సారి డబ్బులు చెల్లించే విధానం ఉండేది
..అపుడు పాల ఉత్పత్తి పెంచమంటే ఇపుడు తగ్గించమంటున్నారు
...ఆంధ్రా డైరీ లకు పెద్ద పీట వేసి విజయ డైరీ ని తొక్కే కుట్ర జరుగుతోంది
..తెలంగాణ నుంచి ఐదు లక్షల లీటర్లే పాలు సేకరిస్తున్నప్పుడు మిగతా పాలు దేంతో తయారు చేస్తున్నారో ఆలోచించాలి
..ఏ రాష్ట్రానికి సరిపడా పాలు అందించే స్థితి లో పాడి రైతులు లేనపుడు ఉత్పత్తి తగ్గించమని ఎలా అంటారు ?
..ఇది ప్రజల ఆరోగ్యం తో ముడిపడిన అంశం ..రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ద్రుష్టి సారించాలి
0 Comments