బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు


*సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట*.. 

*లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు*..

*ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది*..

అటు ఈడీ లాయర్, ఇటు కవిత తరపు లాయర్ వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు.. కవితకు బెయిల్ మంజూరు చేసింది

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్​పై విచారించిన జస్టిస్ బీఆర్​ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య​ ధర్మాసనం, ఈడీ, సీబీఐ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది.
.


Post a Comment

0 Comments