*కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు...**మాజీమంత్రి హరీశ్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాయింట్స్ : PART - 1

*కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు...*

*మాజీమంత్రి హరీశ్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాయింట్స్ : PART - 1*

• గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.

• కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో  కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. 

• మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంది. 

• ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. 

• ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా  నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి.

• ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా  నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ. 

• వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నం.

• మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నం. 

• కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండినయి. 

• కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లొచ్చినయి. 
• అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో  రంగనాయక సాగర్ కు నీళ్లొచ్చినయి.
• రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చినయి.

• మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో    కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లొచ్చినయి.

• ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. వ్యవస్థ అంతా పనిచేయడం వల్లనే లక్షల ఎకరాల్లో పంట పండింది

• కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదు అంటడు సీఎం రేవంత్ రెడ్డి.

• ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటడు. 

• ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటడు. 

• ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు,  ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతడు. 

• కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. 

• కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. 

• కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది. 

• ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. 

• కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందింది.

Post a Comment

0 Comments