మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని లేని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపిన ముఖరా కె మహిళలు,


కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటిలలో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని లేని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపిన ముఖరా కె మహిళలు, మహాలక్ష్మి పథకంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు 2500 రూపాయలు, కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ ఆదినాయకురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు ఉత్తరాలు పంపిన ముఖరా కె మహిళలు.....
తెలంగాణ లో ఎన్నికల సమయం లో మీరు వచ్చి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు ఇస్తానని చెప్పి అధికారంలో వచ్చి 15 నెలలు అవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా హామీలు అమలు చేస్తలేరని, దేవుళ్ళ మిద ఓట్లు వేసి ప్రజలను మభ్య పెడ్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వాని నమ్మి మోసపోయామని, మహిళా దినోత్సవం సందర్బంగా వెంటనే ఈ హామీలు అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణ లోని మహిళలందరు కలిసి ఢిల్లీలో జనపథ్ లో సోనియా గాంధీ ,ప్రియాంక గాంధీ ఇంటి వద్ద ఆందోళన చేస్తామని అన్నారు,గ్రామంలోని మహిళలందరు కలిసి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు ఈ కార్యక్రమంలో గాడ్గే మీనాక్షి, అర్చన, రేణుకబాయి, ఇందు బాయి మరియు మహిళలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments