.*కాంగ్రెస్ కులగణన తప్పుల తడక*.
*రీసర్వేకు బీఆర్ఎస్ డిమాండ్*.
*బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సిఎం రేవంత్ వారని క్షమాపణ కోరాలి*.
*ఎన్నికల ప్రచారంలో, ప్రభుత్వంలోనూ బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది*.
*కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టం*
*బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతాం*.
*ఈరోజు పార్టీ బీసీ నేతలతో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్*
*కేటీఆర్ కామెంట్స్*
బీసీల జనాభాను ఐదున్నర పర్సెంట్ తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది.
42% రిజర్వేషన్ల వాగ్దానాన్ని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీనిపై శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నిరసనను తెలిపాం.
కులగణన తప్పుల తడక . చిత్తుకాగితంతో సమానం. ఈ సర్వే తో బలహీన వర్గాల గొంతును కాంగ్రెస్ కోసింది దీన్ని ఏ బీసీ బిడ్డా ఒప్పుకోడు.
మధుసూదనా చారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తన వాదనను వినిపించింది.
శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలి. బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలతో ఉన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు, బీసీ బిడ్డలు భయపడుతున్నారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను విమర్శిస్తుంది. .
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సమగ్ర సర్వేను అందులోని బీసీ జనాభాను తప్పుపడుతూ ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతున్నారు.
బిసి డిక్లరేషన్ పేరిట కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది.
బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని సిద్ధరామయ్య నోటి వెంట కాంగ్రెస్ పార్టీ చెప్పించింది.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రోక్యుర్మెంట్లలో 42% బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ సంవత్సరం గడిచిన 15 పైసలు కూడా బీసీ డీక్లరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించలేదు.
కొత్తగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఒక్కో కార్పొరేషన్ 50 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి 50 పైసలు కూడా ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను క్షమాపణ అడగాలి.
ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన దుర్మార్గాన్ని రేవంత్ రెడ్డి చేసిండు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన అశాస్త్రీయం అసంబద్ధం.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నే కులగణన సర్వేను చిత్తుకాగితంతో సమానమని కాలబెట్టిండు.
మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కులగణలో మేమంతా పాల్గొంటాం .
కోరిన వివరణ వివరాలు ఇస్తాము. రీసర్వే కు వెంటనే ఆదేశించాలి.
42% రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. దీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాము. కానీ బిల్లు తేలేదు సొల్లు మాత్రం చెప్పారు.
బీఆర్ఎస్ మాత్రమే 50 శాతానికి పైగానే బీసీలకు పార్టీ పరంగా అసెంబ్లీ పార్లమెంటు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది అత్యధిక సీట్లు కేటాయించింది.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చింది.
శాసనసభ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది.. కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చారు అందులో పాతబస్తీలో ఐదు సీట్లు ఉన్నాయి.
టిఆర్ఎస్ మాత్రం చెప్పకుండానే బలైహీన వర్గాలకు 34 సీట్లు వచ్చింది. మాకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు.
బీసీల ఆందోళన ఆవేదనను మేము అర్థం చేసుకున్నాం.
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా జిల్లా కేంద్రాల వారిగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తాం. ప్రజలను జాగృతం చేస్తాం.
ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా వారి గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించాం. కెసిఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని కచ్చితంగా ఎండగడతాం.
మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూర్చునీ చాయ్ తాగే లోపు రాజ్యాంగ సవరణ జరుగుతుంది.
ఇందిరాగాంధీ జమానాల్లో ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా?
బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తలేరని అడుగుతున్నా.
రేపటి నుంచి మండలాల వారిగా గ్రామాల వారీగా ప్రెస్మీట్లో చిన్న చిన్న సమావేశాలతో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను జాగృతం చేస్తాం.
0 Comments