ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నడు.
సీఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం.
దుఃఖంలో ఉన్న ప్రజలకు భరోసాను కల్పించాల్సిన సిఎం మళ్లీ అవే ఊకదంపుడు మాటలు మాట్లాడిండు.
రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నరు.
తాను చీఫ్ మినిస్టర్ కాదు... చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నడు.
ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నడు.
పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య తిరుగుతుంటే, నువు మాత్రం ఈరోజు వరకు హైదరాబాద్ లో ఫిడేల్ వాయించావు.
వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, ప్రాణాలు కోల్పోతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నావు.
ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం మరొకటి ఉండదు రేవంత్ రెడ్డి.
రాజకీయాలు పక్కనపెట్టి ఆపత్కాలంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడు. సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని దైర్యం ఇవ్వు.
.jpeg)
0 Comments