ఖమ్మంలో వరద బాధితులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ తదితరుల వాహనాలపై కాంగ్రెస్ గూండాల దాడి గర్హనీయం
దాడిలో కాలికి గాయం అయిన బీఆర్ఎస్ కార్యకర్త త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా
భారీ వర్షాలతో రెండు రోజులు ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి నిన్న తీరిగ్గా ఖమ్మం వెళ్లాడు
48 గంటలు తమను పట్టించుకోని ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడడంతో రేవంత్ రెడ్డి అధికారులు, సెక్యూరిటీ మీద బూతులు లగించుకోవడం సిగ్గు చేటు
ప్రజలకు సాయం చేయలేని ప్రభుత్వం, ప్రజలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడులకు పాల్పడుతుంది
కాంగ్రెస్ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న తీరుగా ఉంది
అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది అన్న సోయి ఈ సర్కారుకు లేదు
అన్ని విషయాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపుతుంది
రేవంత్ వ్యాఖ్యలు చూసి, మంత్రుల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
ఇప్పటికైనా సర్కారు బుద్దితెచ్చుకుని వరద బాధితులకు సహాయం అందించాలి
ఖమ్మం పర్యటనలో వరద బాధితులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ లోని వాహనాలపై కాంగ్రెస్ దాడిని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
0 Comments