ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారి దశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్

 
ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారి దశ దినకర్మ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. భువనగిరి లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని ఓదార్చారు. ఈ సందర్భంగా జిట్టా తో ఉన్న అనుబంధాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న జిట్టా బాలకృష్ణారెడ్డి  లేరన్న వార్త నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. జిట్టా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Post a Comment

0 Comments