ఎస్బీఐ ఛైర్మన్ గా తెలంగాణ బిడ్డ ఎంపిక కావడం హర్షణీయం


ఎస్బీఐ  ఛైర్మన్ గా తెలంగాణ బిడ్డ ఎంపిక కావడం హర్షణీయం.

SBI (స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా) 27వ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం పట్ల   జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 చల్ల శ్రీనివాసులు శెట్టి ఒక మారుమూల గ్రామంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం విద్యనభ్యసించి , ఇప్పుడు SBI చైర్మన్ గా నియామకం అయ్యే స్థాయికి ఎదగడం గొప్ప పరిణామమని, SBI చైర్మన్ గా ఇన్నేళ్ల కాలంలో తెలుగు వాళ్ళు   ఎవరు నియామకం  కాలేదు, ఇప్పుడు శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం తెలంగాణ ప్రాంతానికి గొప్ప విశేషం.

తెలంగాణ ప్రాంతం నుంచి SBI బ్యాంకు చైర్మన్ గా నియామకం అయిన శ్రీనివాసులు శెట్టి గారిని తెలంగాణ ప్రభుత్వం తరపున  సన్మానించాలని  జిల్లా ప్రజలు కోరుతున్నారు .

Post a Comment

0 Comments