.కే టీ ఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోంది.మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి ,సునీతా లక్ష్మా రెడ్డి ,సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ,సుశీలా రెడ్డి

 
...మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి ,సునీతా లక్ష్మా రెడ్డి ,సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ,సుశీలా రెడ్డి ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్ 
.....బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు తన ప్రసంగం లో పొరపాటు దొర్లితే హుందా గా క్షమాపణ చెప్పారు 
..కే టీ ఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోంది 
..కే టీ ఆర్ క్షమాపణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు 
..ఇద్దరు మహిళా మంత్రులు కూడా కే టీ ఆర్ పై విమర్శలు చేస్తున్నారు 
..మహిళా కమిషన్ అతి వేగంగా స్పందించింది 
..ఎనిమిది నెలలుగా రాష్ట్రం లో మహిళల పై 1800 అత్యాచారాలు జరిగాయి 
..రేప్ లు మర్డర్లు నిత్యకృత్యంగా మారాయి 
..మహిళల పై ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ కే టీ ఆర్ పొరపాటున మాట్లాడిన మాటల పై అంత వేగంగా స్పందిస్తుందా ?
.కే టీ ఆర్ వ్యాఖ్యల పై మహిళ కమిషన్ చూపిన ఉత్సాహం భాదిత మహిళలను పరామర్శించడం లో ఎందుకు చూపలేకపోయింది ?
..ఇద్దరు మహిళ మంత్రులు ఇప్పుడేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నారు 
..అత్యాచారాల బారిన పడ్డ మహిళలను ఒక్కరి నైనా ఇద్దరు మంత్రులు మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారా ?
...మమ్మల్ని అసెంబ్లీ లో సీఎం ,డిప్యూటీ సీఎం అనకూడని మాటలు అంటే ఈ మహిళా కమిషన్ ,మంత్రులు ఎక్కడికి వెళ్లారు ?
,,కే టీ ఆర్ కు కేసీఆర్ సంస్కారము నేర్పారు కాబట్టే ఆయన క్షమాపణ చెప్పారు 
..మరి సీఎం కు ఎవరు సంస్కారం నేర్పినట్టు లేదు ..అందుకే క్షమాపణ చెప్పలేదు 
..నాలుగున్నర గంటలు మహిళల మైన మేము అసెంబ్లీలో నిలబడితే కూడా సీఎం క్షమాపణ చెప్పలేదు ..కనీసం మైక్ ఇవ్వలేదు 
..ఇదేనా మహిళల పట్ల సీఎం కున్న అభిమానం ..మహిళా మంత్రులు సమాధానం చెప్పాలి 
..గతంలో ఆసెంబ్లీ సాక్షి గా డీ కే అరుణకు కే టీ ఆర్ తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారు .ఇది మా సంస్కారం 
..ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక సీఎం మోసం చేశారు 
..మహిళలలకు ఎన్నో పథకాలు తెచ్చి వారి సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే 
.హరీష్ రావు క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నాం 
..ఇదేనా ప్రజా పాలనా ?ఇదేం సంస్కృతి ?
..సీఎం ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు 
......ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ...
...సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం స్థానం లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినపుడే రాష్ట్ర మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అవమానం చేసింది 
..మహిళలకు ఈ ఎనిమిదినెలల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం 
..సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీ పై రంకెలు వేస్తున్నారు 
..రుణమాఫీ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలే రుణ మాఫీ పూర్తిగా కాలేదని చెబుతున్నాయి 
..కే సీఆర్ ,కే టీ ఆర్ పై మహిళా మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం 
..హరీష్ రావు క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి 
..హరీష్ రావు ను రాజీనామా కోరే అర్హత సీఎం కి లేదు 
.......మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి ...
...అసెంబ్లీ సమావేశాల్లో బీ ఆర్ ఎస్ పై చేయి సాధించడం లో కే టీ ఆర్ ,హరీష్ రావు ల పాత్ర ప్రముఖంగా ఉంది 
..అందుకే సీఎం ,కాంగ్రెస్ నేతలు వారిద్దరిని కావాలని టార్గెట్ చేస్తున్నారు 
.కే టీ ఆర్ క్షమాపణ చెప్పినా మహిళా మంత్రులు రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు 
...హరీష్ రావు లక్ష్యంగా ఆయన క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం పిరికి పందల చర్య 
..ఇలాంటి భౌతిక డాడులతో కాంగ్రెస్ ఏం సాధించలేదు 
..రైతు రుణ మాఫీ మేడి పండు లా మారింది 
..క్షేత్ర స్థాయిలో రుణ మాఫీ కాలేదు అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు 
..హరీష్ రావు ఒత్తిడి తో ఈ మాత్రం రుణ మాఫీ అయింది 
..మహిళా కమిషన్ ద్రుష్టి పెట్టాల్సిన అంశాల పై ద్రుష్టి పెట్టడం లేదు 
..షీ టీమ్స్ నిర్వీర్యమయ్యాయి 
..నియోజక వర్గాల్లో కూడా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారు 
..మమ్మల్ని అవమానించిన సీఎం తో మంత్రులు మహిళా కమిషన్ సారీ చెప్పిస్తే బాగుంటుంది 
..కే టీ ఆర్ క్షమాపణ చెప్పినా ఇంకా రాద్ధాంతం చేయడం సరి కాదు 
..ఆరు గ్యారంటీలు 13 హామీలపై ద్రుష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది 
......ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ...
...కేసీఆర్ హయం లో తెలంగాణ అభివృద్ధి ప్రపంచం ద్రుష్టి ని ఆకర్షించింది 
..అన్ని వర్గాలతో పాటు మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది 
..చిన్న చిన్న విషయాలను పట్టుకుని ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోతోంది 
...కే టీ ఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాక కూడా కాంగ్రెస్ రాజకీయం దేనికి ?
..హరీష్ రావు ఆఫీస్ పై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
..ఇలాంటి ఘటనలతో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి ?
..విద్యా వ్యవస్థ రాష్ట్రం లో కుంటు పడింది 
..మా మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పకుండా మిగతా విషయాలు మాట్లాడటం దండగ

Post a Comment

0 Comments